Telangana Elections: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చే సీట్లెన్ని? కేసీఆర్ చెప్పిన లెక్క ఇదీ..! – Watch Video

|

Nov 21, 2023 | 3:12 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో..? తన విశ్లేషణగా చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ సారి కూడా కేవలం 20 లేదా.. అంత కంటే తక్కువ స్థానాలు మాత్రమే వస్తాయని మధిర సభలో ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో డజను మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో..? తనదైన శైలిలో విశ్లేషించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఈ సారి కూడా కేవలం 20 లేదా.. అంత కంటే తక్కువ స్థానాలు మాత్రమే వస్తాయని మధిర సభలో ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో డజను మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు తాను 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు గుర్తుచేసిన ఆయన.. తాను ఎక్కడ ప్రచారం నిర్వహిస్తే అక్కడ కాంగ్రెస్ ఊడ్చుకుని పోతోందని అన్నారు. మరో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తే అక్కడ కూడా కాంగ్రెస్ ఇక మిగలదని అన్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ప్రచారం వట్టిదేనని కేసీఆర్ కొట్టిపారేశారు. తాను గెలిస్తే సీఎం అవుతానని మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత మెజార్టీ కంటే ఎక్కువతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ విజయంపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్‌కు మరికొన్ని రోజులే ఉండటంతో అన్ని పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

Published on: Nov 21, 2023 03:09 PM