పాన్‌ ఇండియా పార్టీకి ముహూర్తం ఫిక్స్‌! బీఆర్ఎస్‌గా మారనున్న తెలంగాణ రాష్ట్ర సమితి(Video)

|

Oct 04, 2022 | 10:32 AM

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు TRS అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముహుర్తం ఖరారు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై వస్తున్న ఊహాగానాలకు TRS తెరదించింది.

జాతీయ పార్టీ ఏర్పాటు వైపు కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని నిర్ణయించిన గులాబీ బాస్‌ బుదవారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. బుదవారం సమావేశానికి 283 మందిని ఆహ్వానించారు. సరిగ్గా మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఎల్లుండి ఈసీ వద్దకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Published on: Oct 04, 2022 10:15 AM