Chandrababu: ‘రేపో మాపో నన్ను అరెస్టు చేసినా చేస్తారు..’ చంద్రబాబు సంచలన కామెంట్స్

|

Sep 06, 2023 | 1:49 PM

"ఒకటి రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.. నాపైన దాడులు కూడా చేస్తారు. నాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు... నిప్పులా బతికాను. కురుక్షేత్రం, రామాయణంలో ధర్మం గెలిచినట్లు మనము గెలుస్తున్నాం. ఎప్పుడూ రాని మెజార్టీ ఈసారి వస్తుంది" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా నిప్పులా బతికాను అన్నారు చంద్రబాబు.

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఐటీ నోటీసులు, ఇటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో నన్ను అరెస్టు చేసినా చేస్తారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనపై దాడులు కూడా చేస్తారని.. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా నిప్పులా బతికాను అన్నారు చంద్రబాబు. గతంలో వైఎస్‌ఆర్‌ తనపై 26 ఎంక్వేరీలు వేశారని.. ఎన్ని కేసులు వేసినా ఎవరూ ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అరాచకం చేస్తోందన్నారు. ఏదో కంపెనీని తీసుకువచ్చి తన పేరు చెప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్ డెవలప్‌మెంట్‌, రాజధాని, అమరావతి ల్యాండ్స్.. అవుటర్‌ రింగ్‌ రోడ్‌ అవినీతి.. ఇప్పడు ఇప్పుడు ఇన్‌కంట్యాక్స్‌ అంటున్నారని చంద్రబాబు ఫైరయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Sep 06, 2023 01:48 PM