Watch: ఏపీలో వైసీపీకి ఎదురుగాలి.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ ఎదురుగాలికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఈ ఎదురుగాలికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఏపీ ప్రజలు బీజేపీని ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అందుకే చాలా చోట్ల ఎమ్మెల్యేలను మారుస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై సర్వే చేస్తున్నారని.. మరి సీఎం జగన్ పనితీరుపై ఎందుకు సర్వే చేయించుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎంగా పనితీరుకు జగన్‌కు పాస్ మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. గత నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ ప్రజలకు చేసిందేమి లేదని పెదవి విరిచారు. కేంద్రం నిధులను..రాష్ట్ర పథకాలకు వాడుకున్నారంటూ భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు.
Published on: Jan 06, 2024 01:06 PM