Watch: కవిత ఎపిసోడ్‌పై మల్లా రెడ్డి ఇంట్రెస్టింగ్ రియాక్షన్
కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్‌ను కుదిపేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావుపై కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఎపిసోడ్‌పై మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరిస్తే ఎవరినైనా సస్పెండ్ చేయాల్సిందే అన్నారు. కేసీఆర్‌కు బిడ్డకన్నా ప్రజలు, తెలంగాణే ముఖ్యమన్నారు. కుటుంబంలో సమస్యలు మామూలే అన్నారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్..కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కాగా కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ ద్వారా వచ్చినందునే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కుట్రపన్ని తనను పార్టీ నుంచి బయటకు పంపారని.. రేపు కేసీఆర్, కేటీఆర్‌కు కూడా ఇదే పరిస్థితి రావొచ్చన్నారు. హరీష్ రావు, సంతోష్‌లపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.