తెలంగాణలో పెరిగిన పొలిటికల్ హీట్.. త్రిముఖపోరులో తగ్గేదేలే అంటున్న నేతలు..(Video)
తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు గేర్లు మార్చి మరీ ముందుకెళుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల పేరిట అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ క్యాడర్‌ని ఎన్నికలకు సంసిద్దం చేస్తోంది.
తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు గేర్లు మార్చి మరీ ముందుకెళుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల పేరిట అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ క్యాడర్‌ని ఎన్నికలకు సంసిద్దం చేస్తోంది. పాదయాత్రల పేరిట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారు. వీలున్నప్పుడల్లా జాతీయ నేతలను రాష్ట్రానికి ఆహ్వానించి, ప్రజలకు పార్టీ సందేశాన్ని వినిపించేస్తున్నారు. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. వాటిని చురుకుగా అమలు చేసేస్తోంది. తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి సారించిన బీజేపీ అధినాయకత్వం దిగ్గజ నేతలను తరచూ తెలంగాణకు పంపుతోంది. ఇటీవల తెలంగాణకు రెండు జాతీయ పార్టీల దిగ్గజ నేతల రాకపోకలు బాగా పెరిగాయి. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.
Published on: Apr 26, 2023 10:41 AM