మాకు, కేంద్ర ప్రభుత్వానికి పడదు.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

| Edited By: Janardhan Veluru

Sep 21, 2023 | 1:37 PM

పారిశ్రామికీకరణతో ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తోందని అన్నారు. దేశంలో అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వ సంబంధాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాకు, కేంద్ర ప్రభుత్వానికి పడదని.. తెల్లారిలేస్తే మేమూ, వాళ్లూ తిట్టుకుంటామని.. విమర్శలు చేసుకుంటామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ నడుస్తూ ఉంటుందన్నారు.. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్ వన్ ఎవరని అడిగితే.. తెలంగాణ రాష్ట్రమని కేంద్రం కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తోందన్న కేటీఆర్.. దేశ సగటు తలసరి ఆదాయం రూ.1,49,000 గా ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,00గా ఉందని వివరించారు. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్వీ కంపెనీ కొత్త యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాలతో విస్తరిస్తామని మంత్రి తెలిపారు.

పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తోందని అన్నారు. దేశంలో అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.