Watch Video: బీజేపీని ఓడించేందుకు అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

|

May 02, 2024 | 6:05 PM

పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్లలో తన విజయంపై బీజేపీ  ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రజల్లో ఉండే వ్యక్తిగా తనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు జరుగుతున్నాయని.. వాటిని ఎన్నికల్లో ప్రజలే తిప్పికొడతారన్నారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.

పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్లలో తన విజయంపై బీజేపీ  ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రజల్లో ఉండే వ్యక్తిగా తనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు జరుగుతున్నాయని.. వాటిని ఎన్నికల్లో ప్రజలే తిప్పికొడతారన్నారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. దేశం కోసం, దేశ ప్రధాని కోసం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేయడానికి ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారన్నారు. సమస్యల పరిష్కారానికి తానెప్పుడూ ప్రజలతో ఉంటానని.. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానన్నారు కొండా. చేవెళ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో పెట్టానని అంటున్నబీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో సీనియర్ కరస్పాండెంట్ ఎలెందర్ ఫేస్ టు ఫేస్…