Watch Video: పాలకుర్తిలో హీటెక్కిన పాలిటిక్స్.. రేవంత్, ఎర్రబెల్లి మధ్య మాటల తూటాలు

|

Nov 09, 2023 | 6:00 PM

పాలకుర్తి నుంచి ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి కాంగ్రెస్ తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తలపడుతున్నారు.  తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి మధ్య మాటల తూటాలు పేలాయి.

పాలకుర్తి పాలిటిక్స్ మరింత హీటెక్కాయ్‌. మంత్రి ఎర్రబెల్లి టార్గెట్‌గా రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎర్రబెల్లి ఓ నమ్మకద్రోహి, అవినీతిపరుడంటూ ధ్వజమెత్తారు.తనను జైల్లో పెట్టించింది ఎర్రబెల్లి దయాకర్ అంటూ.. శత్రువులతో చేతులు కలిపి టీడీపీకి ఎర్రబెల్లి నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. దయాకర్ రావు దందాలు చేసి వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తిలో దయాకర్‌కు బొందపెట్టాలన్నారు.  అంతే స్ధాయిలో రేవంత్‌కి ఎర్రబెల్లి దయాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు.

పాలకుర్తి నుంచి ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డి కాంగ్రెస్ తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తలపడుతున్నారు.  తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.