ఆరు గ్యారెంటీలను ముందు అక్కడ అమలు చేయండి.. కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ ఛాలెంజ్
తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని BRS అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏడాదిలో ఎంత మంది మారుతారో తెలియదన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంటున్న పరిస్థితులను చూడాలని కోరారు. టిక్కెట్ల కోసం కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ ఆఫీసులను తగులబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని BRS అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏడాదిలో ఎంత మంది మారుతారో తెలియదన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంటున్న పరిస్థితులను చూడాలని కోరారు. టిక్కెట్ల కోసం కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ ఆఫీసులను తగులబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటురని, టికెట్లు కొనుక్కొంటున్నారని ఆ పార్టీలో సంస్కారం ఎంత మాత్రం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌లో డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. మంథనిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడిన సీఎం కేసీఆర్.. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ను గెలిపించాలని కోరారు.