కాంగ్రెస్‌కు చెరుకు సుధాకర్‌ రాజీనామా.. నేడు బీఆర్‌ఎస్‌లోకి

|

Oct 21, 2023 | 12:28 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెరుకు సుధాకర్‌ రాజీనామా చేశారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఓడిపోయే స్థానాలను బీసీలకు కేటాయించి నిందలు వేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సుధాకర్.. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూద్దాం...

కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ రాజీనామా చేశారు. ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో బీసీల ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందన్నారు. బీసీలను అణగదొక్కే కుట్ర జరుగుతోందని.. ఓడిపోయే స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చి నిందలు వేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను అవమానించినా… పార్టీ పెద్దలెవరూ ఆయనను వారించలేదన్నారు.

ఆర్థికంగా బలంగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారికే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని, మధు యాష్కీ లాంటి బీసీ నేతలను కించపరిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ  మాటల్లో చెప్పడం తప్ప కాంగ్రెస్ చెబుతున్న సామాజిక న్యాయం అమలు కావడం లేదని ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ  చేయండి..

 

Published on: Oct 21, 2023 12:25 PM