Telangana: తెలంగాణ ఆర్థికస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల

|

Dec 20, 2023 | 11:14 AM

తెలంగాణ అసెంబ్లీ మరోసారి హీటెక్కిపోయింది. గవర్నర్‌ స్పీచ్‌కి ధన్యవాద తీర్మానంపైనే అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక రేంజ్‌లో మాటల యుద్ధం జరిగింది. ఇక ఇప్పుడు గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయడంతో ఇవాళ అసెంబ్లీ అట్టుడియింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ముందుకెళ్తుంటే... అందుకు, దీటైన కౌంటర్లు ఇస్తుంది ప్రతిపక్షం.

తెలంగాణ అసెంబ్లీ మరోసారి హీటెక్కిపోయింది. గవర్నర్‌ స్పీచ్‌కి ధన్యవాద తీర్మానంపైనే అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక రేంజ్‌లో మాటల యుద్ధం జరిగింది. ఇక ఇప్పుడు గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయడంతో ఇవాళ అసెంబ్లీ అట్టుడియింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ముందుకెళ్తుంటే… అందుకు, దీటైన కౌంటర్లు ఇస్తుంది ప్రతిపక్షం.

పదేళ్ల బీఆర్‌ఎస్‌లో ఆర్ధిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందంటోన్న కాంగ్రెస్‌… పలు రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేసింది. ముఖ్యంగా ఆర్ధికశాఖ, ఇరిగేషన్‌, విద్యుత్‌ రంగాల లెక్కలను సభ ముందు పెట్టింది. అయితే  ప్రభుత్వం కంటే ముందే పదేళ్ల అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసింది.  రూపాయి అప్పుచేస్తే, వెయ్యి రూపాయల ఆస్తి కూడబెట్టామని బీఆర్‌ఎస్‌ చెబుతుంది.  అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటున్నారు BRS నేతలు.  సభలో ప్రజెంటేషన్‌కు తమకూ అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Dec 20, 2023 10:46 AM