Watch Video: నారా లోకేశ్ కాలికి బొబ్బలు.. కంటతడి పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..
రాజకీయాల్లో ఎప్పుడూ గంభీరంగా కనిపిస్తూ.. ప్రత్యర్థులపై విరుచుకుపడే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. రొటీన్‌కు భిన్నంగా తనకు వ్యాపారాల్లో వచ్చిన నష్టాలను ఏకరవు పెట్టారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆగకుండా నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.
రాజకీయాల్లో ఎప్పుడూ గంభీరంగా కనిపిస్తూ.. ప్రత్యర్థులపై విరుచుకుపడే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి.. రొటీన్‌కు భిన్నంగా తనకు వ్యాపారాల్లో వచ్చిన నష్టాలను ఏకరవు పెట్టారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆగకుండా నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు.ప్రజలు, రాష్ట్రం కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని కొనియాడారు. ఆక్ష్న సతీమణి, తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను చూసినట్టుగా జనం లోకేశ్‌ను కూడా చూస్తారని వ్యాఖ్యానించారు.
బిజినెస్‌లో తాను చాలా నష్టపోయినా ఎప్పుడూ భయపడలేదని చెప్పారు JC ప్రభాకర్‌రెడ్డి. తన బస్సులు, లారీలు, మైనింగ్ అన్నీ పోయాయని..పైపెచ్చు చాలా బాకీలు ఉంటే భూములు అమ్మి కట్టేసి ప్రశాంతంగా ఉన్నట్టు JC చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఫేస్ వాల్యూ, సీఎం జగన్ చేసిన తప్పులే తమను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయన్నారు. కార్యకర్తలు లేదంటే టీడీపీ లేదని.. టీడీపీ నాయకులు ఎవరూ కార్యకర్తలను మర్చిపోవద్దని సూచించారు ప్రభాకర్‌రెడ్డి.