Attack on YS Jagan: సీఎం జగన్‌పై రాళ్ల దాడి ఘటనపై రాజకీయ రగడ.. వైసీపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం..

|

Apr 15, 2024 | 5:57 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై శనివారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌పై జరిగిన రాళ్ల దాడి వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై శనివారం రాత్రి జరిగిన రాళ్ల దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌పై జరిగిన రాళ్ల దాడి వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. అటు టీడీపీ నేతల వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకే టీడీపీ జగన్‌పై రాళ్ల దాడి ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోందన్నారు. జగన్‌పై దాడి చేసిన వారిని పట్టుకుని, శిక్షింపజేయాలన్న చిత్తశుద్ధి టీడీపీకి లేదన్నారు. బాధితులు తామైతే.. టీడీపీ నేతలు సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. డ్రామాలు చేయాల్సిన అవసరం జగన్‌కు లేదన్నారు. జగన్‌కు జనంలో వస్తున్న ఆదరణను చూసి టీడీపీ, జనసేనకు భయం పట్టుకుందని సజ్జల అన్నారు. బోండా ఉమా, సజ్జల కామెంట్స్ ఈ వీడియోలో చూడండి..

 

Follow us on