Ram Charan: బాబాయ్ కోసం అబ్బాయ్.. పవన్ ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ గ్రాండ్ ఎంట్రీ..

|

Jun 12, 2024 | 12:08 PM

అలాగే కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.. పవన్ తనయుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య, సాయి ధరమ్ తేజ్, నాగబాబు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా బాబాయ్ పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు.

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.. పవన్ తనయుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య, సాయి ధరమ్ తేజ్, నాగబాబు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా బాబాయ్ పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. చరణ్ రాకతో ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద కోలాహలం నెలకొంది. చరణ్‍తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. రామ్ చరణ్ ఎవరినీ నిరాశ పర్చకుండా సెల్ఫీలకు అవకాశం ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on