పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. గుజరాత్ భూజ్ సరిహద్దులో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఆపరేషన్ సింధూర్ ఇంకా సక్రియంగా ఉందని స్పష్టం చేశారు. సర్క్రీక్ వైపు కన్నెత్తి చూస్తే తగిన శాస్తి తప్పదని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. చొరబాట్లకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ భూజ్ సరిహద్దులో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో భాగంగా ఆయుధ పూజలో పాల్గొన్న సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా అమల్లోనే ఉందని ఆయన పునరుద్ఘాటించారు. సరిహద్దుల్లో తోక జాడిస్తున్న పాకిస్తాన్‌కు భారత రక్షణ మంత్రి మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సర్ క్రీక్ ప్రాంతాన్ని తాకాలని చూస్తే తగిన శాస్తి తప్పదని పాకిస్తాన్‌ను గట్టిగా హెచ్చరించారు. సర్ క్రీక్ వైపు కన్నెత్తి చూస్తే చారిత్రకంగా, భౌగోళికంగా పాకిస్తాన్‌ను నామరూపాలు లేకుండా చేసేందుకు భారత ఆర్మీకి ఎంతో సమయం పట్టదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం ప్రభావం ఎలా ఉందంటే
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇండియా రక్షణ వ్యవస్థకు బూస్ట్.. ధ్వని క్షిపణి
