Nara Bhuvaneswari: చంద్రబాబుతో ములాఖత్‌కు భువనేశ్వరి దరఖాస్తు.. తిరస్కరించిన జైలు అధికారులు..
Nara Bhuvaneswari: వారానికి మూడు సార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్న నేపథ్యంలో తొలిసారి భువనేశ్వరి, అమె కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణితో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ, లోకేష్‌తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. ఇంకో ములాఖత్‌కి అవకాశం ఉన్నా.. భువనేశ్వరి దరఖాస్తును కావాలనే తిరస్కరించారని, ఇది సరికాదంటూ టీడీపీ వర్గాలు..
ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 15: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ములాఖత్‌కు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అమె దరఖాస్తును రాజమండ్రి జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో వారానికి మూడు సార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్న నేపథ్యంలో తొలిసారి భువనేశ్వరి, అమె కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణితో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ, లోకేష్‌తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. ఇంకో ములాఖత్‌కి అవకాశం ఉన్నా.. భువనేశ్వరి దరఖాస్తును కావాలనే తిరస్కరించారని, ఇది సరికాదంటూ టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో స్కామ్ జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రికి తరలించారు. అప్పటి నుంచి భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు.
Published on: Sep 15, 2023 01:55 PM