రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం

Updated on: Dec 06, 2025 | 12:27 PM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు వివాదాస్పదమైంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలకు ఆహ్వానం లేకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శశిధరూర్ హాజరు కావడంతో పవన్ ఖేరా విమర్శలు చేశారు. దౌత్య అనుభవం ఉన్నవారికే ఆహ్వానం అని రాష్ట్రపతి భవన్ వివరించింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను విందుకు ఆహ్వానించకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ఈ విందుకు హాజరుకావడం గమనార్హం. రాహుల్, ఖర్గేకు కాకుండా శశిధరూర్‌ను ఆహ్వానించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేతలకు అవమానం జరుగుతున్నప్పుడు ఆ కుట్రలో భాగం కావడం దారుణమని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్పంచ్‌ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

Putin: పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

Prabhas: ప్రభాస్ నా ఇంటర్‌ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Indraja: ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!

Bigg Boss Kalyan: చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్