చంద్రబాబుని అక్రమ అరెస్టు చేసినవారికి పుట్టగతులు ఉండవు : అశ్వినీ దత్

|

Sep 13, 2023 | 3:44 PM

దేశానికి గొప్ప ప్రధానిని, గొప్ప లోక్‌సభ స్పీకర్‌ని, గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుది అని... అలాంటి నేతను దుర్మార్గకరంగా అరెస్టు చేశారని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ పేర్కొన్నారు. దీనికి పరిష్కారం అతి త్వరలో ఉందని చెప్పారు. ఎలక్షన్స్ రాగానే.. ఆయన్ను ఇలా చేసినవారు శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుందని చెప్పారు. తర్వాత చంద్రబాబు అక్రమ అరెస్టుకు కుట్ర పన్నిన వారికి పుట్టగతులు ఉండవని... వారికి శిక్ష తప్పదు అశ్వినీ దత్ వ్యాఖ్యానించారు. 

చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారని అశ్వినీదత్ పేర్కొనగా.. తాజాగా ప్రముఖ నటుడు రజినీకాంత్ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. లోకేష్‌కి ఫోన్‌కాల్‌ చేసి పరామర్మించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అక్రమ కేసులు చంద్రబాబును ఏమీ చెయ్యలేవంటూ భరోసా ఇచ్చారు. ఇవాళా ,రేపు జైల్లో చంద్రబాబుతో వరుస ములాఖాత్‌లు ఉన్నాయి. కాసేపట్లో చంద్రబాబును కలవనున్నారు అడ్వకేట్ లూథ్రా. కేసులపై తదుపరి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సాయంత్రం బాబుతో బాలకృష్ణ ములాఖాత్ అవ్వనున్నారు.  రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌కి వెళ్లి… బాబుతో ములాఖాత్ అవ్వనున్నారు పవన్ కల్యాణ్.