Weekend Hour: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ .. నెక్స్ట్ ఏంటీ..?

|

Dec 11, 2022 | 7:13 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సాక్షిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను విచారించారు సీబీఐ అధికారులు. ఈ విచారణ ఏడు గంటలకుపైగా కొనసాగింది. ప్రధానంగా సౌత్ గ్రూప్‌, అమిత్ అరోరా స్టేట్‌మెంట్‌పైనే అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

 

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సాక్షిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను విచారించారు సీబీఐ అధికారులు. ఈ విచారణ ఏడు గంటలకుపైగా కొనసాగింది. ప్రధానంగా సౌత్ గ్రూప్‌, అమిత్ అరోరా స్టేట్‌మెంట్‌పైనే అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ మంత్రి మనీష్‌ సిసోడియా, అమిత్ అరోరా, శరత్ చంద్రారెడ్డిలతో పరిచయాలపైనా ఆరాతీసినట్టు తెలుస్తోంది. కవిత న్యాయవాది సమక్షంలో ప్రస్తుతానికి వివరణ మాత్రమే తీసుకున్నారు సీబీఐ అధికారులు. అయితే సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఉత్కంఠగా మారింది. మరోసారి కవితకు నోటీసులు ఇస్తారా లేదా? లేదంటే ఇంతటితో సరిపెడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఉదయం 11గంటలకు సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స ఆధ్వర్యంలో కవిత నివాసానికి చేరుకున్నారు అధికారులు. ఈ టీంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. కవిత న్యాయవాది సమక్షంలోనే సీబీఐ విచారణ కొనసాగింది.

కొద్ది రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాల్లో మూలాలు ఉన్నట్లుగా అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కవితతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖుల పేర్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ప్రధానంగా వీటిపైనే కవితను సీబీఐ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

Published on: Dec 11, 2022 07:11 PM