Minister Malla Reddy: ఐటీ అధికారులే నమ్మించి మోసం చేశారు.. మల్లారెడ్డి సంచలన ప్రెస్ మీట్(వీడియో)

| Edited By: Ravi Kiran

Nov 24, 2022 | 1:04 PM

మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై నజర్ వేసిన ఐటీ శాఖ.. రెండు రోజుల పాటు సోదాలు చేసింది. తన తనిఖీలలో భాగంగా మల్లారెడ్డి..

మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై నజర్ వేసిన ఐటీ శాఖ.. రెండు రోజుల పాటు సోదాలు చేసింది. తన తనిఖీలలో భాగంగా మల్లారెడ్డి.. ఇంకా ఆయన సన్నిహిత, సమీప బంధువుల ఇళ్లల్లో, మల్లారెడ్డి కార్యాలయాల్లో రైడ్‌లు చేసింది. ఈ సోదాలలో కొంత నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ అధికారులు ఆయన విచారణకు రావాలని మంత్రి మల్లారెడ్డికి సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సోమవారం ఐటీ శాఖ కార్యాలయానికి విచారణ కోసం వెళ్లనున్నారు. అయితే, ఐటీ శాఖలు సోదాలు చేస్తున్న నేపథ్యంలో.. మంగళవారం తన ఇంటి గేటు దాటి బయటికొచ్చిన మల్లారెడ్డి చేతులు పైకి లేపి చిరునవ్వు చిందించిన ఆయన బుధవారం ఉదయం మాత్రం రాజకీయ కక్ష అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. రెండో రోజు సోదాల్లో మూడు పరిణామాలు కీలకంగా మారాయి. మొదటిది.. ప్రీతి రెడ్డికి ఐటీ అధికారుల పిలుపు. ప్రీతి రెడ్డి.. మల్లారెడ్డి కోడలు. ఆమెకు పిలుపు అందగానే ఓ బ్యాగ్‌తో అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే ఆ బ్యాగ్‌లో ఏముంది అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే మల్లారెడ్డి మనవరాలు శ్రేయను బ్యాంక్‌కి తీసుకెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..

వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్‌ అదరగొట్టిందిగా !!

కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్‌ రివర్స్‌అయి..

ఒరబ్బయ్య ఆహా.. అంటూ అదరగొట్టిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్‌ లీ’ మరణ రహస్యం !! ఎలా చనిపోయాడంటే ??

 

Published on: Nov 24, 2022 09:23 AM