కాంగ్రెస్ ఒక్క ఛాన్స్‌ను నమ్మితే మళ్లీ రాష్ట్రంలో అంధకారం- కేటీఆర్

|

Oct 15, 2023 | 8:54 PM

ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్సే. మళ్లీ సీఎం కేసీఆరే. ఇదే ప్రజాతీర్పు అన్నారు కేటీఆర్‌. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని కాంగ్రెస్‌ను ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. ఓటుకు నోటు కేసులో పీసీసీ చీఫ్‌ దారి ఇక జైలుకేనన్నారు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని.. మళ్లీ పాత చీకటి రోజులు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఏదో ముష్ఠి పడేసినట్లు కేవలం 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేదని.. తాము అధికారంలోకి వచ్చాక.. వృద్ధుల ఆత్మగౌరవం పెంచే విధంగా పెన్షన్ ఇచ్చేవారమన్నారు కేటీఆర్. తొలుత వెయ్యి ఇచ్చామని.. రాష్ట్ర ఆర్థిక స్థోమత పెరిగాక 2000 చేశామన్నారు. ఇవాళ దివ్యాంగులు అడక్కుండానే వారికి 4 వేలకు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్‌ అన్న మాటను నమ్మితే ప్రజలు మోసపోతారని కేటీఆర్ హెచ్చరించారు.

తలతెగిపడినా సరే తలవంచే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్‌ . బీజేపీపై పోరులో తగ్గేలేదన్నారు. మతం తప్ప మరో ఫిలాసఫీ లేని బీజేపిని వ్యతిరేకిస్తాం. ఎంతదాకైనా పోరాడుతామన్నారు కేటీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..    

Published on: Oct 15, 2023 08:54 PM