KTR: మాకు ఉన్నది అహంకారం కాదు.. తెలంగాణపై మమకారం: కేటీఆర్

|

Nov 24, 2023 | 2:01 PM

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు తమకు ఉన్నది అహంకారం కాదని.. తెలంగాణపై మమకారమని చెప్పారు..మంత్రి కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని.. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అంశాలే లేవని చెప్పారు. అందుకే ప్రజలకు సంబంధం లేని అంశాలను ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు.

“తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అయింది కొవిడ్‌, ఎన్నికల సమయం పోతే..ఆరున్నర ఏళ్లు మాత్రమే మాకు సమయం దొరికింది. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో రియల్‌ ఎస్టేట్‌పై అనేక అనుమానాలు.. ఆ అనుమానాలన్నీ ఇప్పుడు పటాపంచలైపోయాయి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేపడుతున్నాం. పట్టణాలతో పాటు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి. మా పాలనపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు అంశాలు లేవు..అందుకే ప్రజలకు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తున్నారు. మాకు తెలంగాణపై ఉన్నది అహంకారం కాదు, మమకారం” అని కేటీఆర్ పేర్కొన్నారు. HICCలో జరిగిన రియల్‌ఎస్టేట్‌ సమ్మిట్‌లో పాల్గొన్న కేటీఆర్..బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..