KCR: బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరు- గులాబీ అధినేత ఆన్సర్ ఇదే

|

Apr 24, 2024 | 10:08 AM

4 గంటలు.. నాన్‌స్టాప్‌గా 4 గంటలు.. రజినీకాంత్‌ లైవ్‌ షో విత్‌ కేసీఆర్‌ చరిత్ర సృష్టించింది. పార్టీ ఫిరాయింపుల నుంచి మొదలుపెట్టి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు.. లిక్కర్‌ కేసులో కవిత సహా పలువురి అరెస్టులు.. కాళేశ్వరానికి బీటలు.. ఖజానా అప్పులు.. ఇలా ప్రతి అంశంపై KCR సూటిగా సమాధానాలిచ్చారు. తన వారసుడు ఎవరన్న విషయంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు కేసీఆర్. వారసుడ్ని నిర్ణయించే అధికారం ఎవరికీ ఉండదన్నారు. సమయం, సందర్బాలను బట్టి నాయకులు తయారవుతారని చెప్పారు. ఎవరో తయారు చేస్తే నాయకులు అవ్వరని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తానెప్పుడు ఉద్దేశపూర్వకంగా నాయకులను తయారు చేయలేదని.. ప్రాసెస్‌లో వారంతా రాటు దేలారని చెప్పారు. ప్రజలు, కార్యకర్తల నుంచే నాయకులు అయినవారే ఎక్కువకాలం మనగలరని చెప్పారు. రుద్దినవారు ఎప్పుడో ఒకప్పుడు కనుమరుగు అవుతారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on