డీకే శివకుమార్‌కు తృటిలో తప్పిన ముప్పు.. గద్దను ఢీకొని పగిలిన హెలికాప్టర్ విండ్ షీల్డ్, ఎమర్జెన్సీ ల్యాండింగ్..!

|

May 02, 2023 | 2:59 PM

కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. వందల అడుగుల ఎత్తులో ఉండగా హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ పగిలింది. టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్‌ను గద్ద ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. వందల అడుగుల ఎత్తులో ఉండగా హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ పగిలింది. టేకాఫ్ అయిన కాసేపటికే హెలికాప్టర్‌ను గద్ద ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బీటలతో మొదలై  ఫైలట్ ముందు అద్దం పూర్తిగా పగిలిపోయింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది. హెలికాప్టర్‌ను పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించాడు. హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యేసరిగా  ముందు అద్దం పూర్తిగా పగిలిపోయింది. గాల్లో ఉండగా వెంటనే అద్దం బద్దలై ఉంటే ఆ ప్రమాదం తీవ్రత ఇంకో రకంగా ఉండేది. డీకే శివకుమార్  ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి కోలార్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్ దృశ్యాలు సేకరించింది.

Published on: May 02, 2023 02:58 PM