Watch: కడపలో మరోసారి ప్రొటోకాల్ రచ్చ.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి సీరియస్
Kadapa Protocol Row: కడపలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తనకు స్టేజ్‌పై సీటు వేయకపోవడంతో ఎమ్మెల్యే మాధవీ రెడ్డి భగ్గుమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కావడంతో పాటు ప్రభుత్వ విప్‌గా ఉన్న తనను స్టేజి మీదకు ఆహ్వానించకపోవడంపై మాధవీరెడ్డి మండిపడ్డారు.
కడపలో మరోసారి ప్రొటోకాల్ పాటించలేదంటూ భగ్గుమన్నారు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్టేజీపై తనకు సీటు వేయకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పైగా ప్రభుత్వ విప్‌గా ఉన్న తనను స్టేజి మీదకు ఆహ్వానించకపోవడంపై మాధవీరెడ్డి మండిపడ్డారు. అధికారులు వచ్చి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అవసరం లేదంటూ తిప్పి పంపారు. జేసీతో పాటు కలెక్టర్ శ్రీధర్ కూడా ఎమ్మెల్యేను స్టేజి పైకి రావాలని ఆహ్వానించారు. అయినా ఆమె తిరస్కరించడంతో పాటు అరగంటకు పైగా అక్కడే భర్తతో కలిసి నిలబడి కార్యక్రమంలో పాల్గొని తన నిరసన తెలిపారు. ఈ సమయంలో మంత్రి NMD ఫారూక్ సహా ఉన్నతాధికారులు అంతా అక్కడే ఉన్నారు.
Published on: Aug 15, 2025 06:16 PM