KA Paul: సీబీఐ మాజీ జేడీ కొత్త పార్టీ ఏర్పాటు వెనుక ఆ పార్టీ హస్తం.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

|

Dec 23, 2023 | 4:41 PM

ఏపీలో కొత్త పార్టీ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శలు గుప్పించారు. గతంలో ప్రజాశాంతి పార్టీలో చేరతానని లక్ష్మీనారాయణ అన్నారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆయన.. వేరే పార్టీ దగ్గర వెయ్యికోట్లు తీసుకుని కొత్త పార్టీ పెడుతున్నారంటూ కేఏ పాల్‌ ఆరోపించారు.

ఏపీలో కొత్త పార్టీ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శలు గుప్పించారు. గతంలో ప్రజాశాంతి పార్టీలో చేరతానని లక్ష్మీనారాయణ అన్నారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆయన.. వేరే పార్టీ దగ్గర వెయ్యికోట్లు తీసుకుని కొత్త పార్టీ పెడుతున్నారంటూ కేఏ పాల్‌ ఆరోపించారు. లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ గెలవకుండా.. ఓట్లు చీల్చేందుకు లక్ష్మీనారాయణతో ఆర్ఎస్ఎస్, బీజేపీలు కొత్త పార్టీ పెట్టిస్తున్నట్లు తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. కొత్త పార్టీ పెట్టుకున్నా తమకు వచ్చే నష్టమేమీ లేదని ధీమా వ్యక్తంచేశారు..

ఆంధ్రప్రదేశ్‌లో ‘జై భారత్ నేషనల్’ పేరుతో కొత్త పార్టీని పెడుతున్నట్లు వీవీ లక్ష్మీనారాయణ శుక్రవారంనాడు విజయవాడలో ప్రకటించడం తెలిసిందే. ఏపీలో నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాకపోవడమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాను సాధించడంలో ఏపీలోని అన్ని పార్టీలో విఫలం చెందాయని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ పుట్టిందని ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకురావడంతో పాటు అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు తమ పార్టీ కృషిచేస్తుందని తెలిపారు.