KA Paul: అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

Updated on: Jan 20, 2026 | 7:04 PM

ప్రపంచ యుద్ధాలు, వాటి ఆర్థిక, మానవ నష్టాలపై కేఏ పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాల నాయకుడిగా మారిన ట్రంప్, మౌనంగా ఉన్న ప్రధాని మోడీలపై విమర్శలు గుప్పించారు. శాంతి స్థాపనకై ప్రజలు ప్రార్ధించి, ప్రచారం చేయాలని పిలుపునిస్తూ, ఫిబ్రవరి 22న చెన్నైలో ప్రపంచ శాంతి సభను ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, వాటి వల్ల కలిగే నష్టాలపై కేఏ పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 15న అమెరికన్ కాన్సస్ సెనేట్‌లో తాను చేసిన ప్రసంగం అద్భుతంగా ఆదరణ పొందిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 58 యుద్ధాలు జరుగుతున్నాయని, సంవత్సరానికి మూడు ట్రిలియన్ డాలర్లు యుద్ధ సామగ్రిపై ఖర్చు అవుతోందని, ఇది నష్టాన్ని మాత్రమే మిగిల్చిందని ఆయన వివరించారు. 1989 నుండి నాలుగు ట్రిలియన్ల అప్పు ఇప్పుడు దాదాపు 40 ట్రిలియన్లకు పెరిగిందని, యుద్ధాల వల్ల కోట్లాది మంది మరణిస్తున్నారని కేఏ పాల్ తెలిపారు. ప్రపంచ జనాభాలో రెండు వందల కోట్ల మందికి పైగా ఆహారం లేక బాధపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Medaram Jathara: వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

KA Paul: ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి

గ్రీన్‌లాండ్‌ కు సైనిక బలగాల తరలింపు

Gold Price Today: చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి ధర.. మంగళవారం ఎంత పెరిగిందంటే

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు.. వెదర్‌ రిపోర్ట్