కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం

Edited By:

Updated on: Jan 22, 2026 | 9:16 PM

అధికారిక విధిలో లేకపోయినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కాకినాడ మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఏపీ హోం మంత్రి అనిత సత్కరించారు. స్వయంగా తన నివాసానికి ఆహ్వానించి, కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. కష్టపడే ప్రతి పోలీసు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సంఘటన స్పష్టం చేసింది. ఇది పోలీస్ వ్యవస్థలో పనిచేసేవారికి గొప్ప ఉత్సాహాన్ని నింపి, వారి సేవల గుర్తింపునకు బలమైన ఉదాహరణగా నిలిచింది.

పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా కర్తవ్యం నిర్వహించిన ఒక కానిస్టేబుల్‌కు స్వయంగా ఏపీ హోమ్ మంత్రి ఇచ్చిన గౌరవం, పోలీస్ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఒక ఉత్సాహంగా మారనుంది. పని చేసే వారికి గుర్తింపు ఉంటుంది, ప్రభుత్వం వారి వెనకే ఉంటుందన్న నమ్మకాన్ని బలంగా చాటిన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. సెలవు సమయంలోనూ కర్తవ్యం మరవని ఒక కానిస్టేబుల్‌ను అభినందించడానికి స్వయంగా ఏపీ హోం మంత్రే రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆ మహిళా కానిస్టేబుల్‌కు ప్రభుత్వ గౌరవం ఎలా ఉండాలన్నదానికి హోం మంత్రి అనిత ఒక బలమైన ఉదాహరణ ను సెట్ చేసారు. విధి నిర్వహణలో లేని సమయంలోనూ బాధ్యత మరిచిపోని ఆ కానిస్టేబుల్‌ను తన నివాసానికి పిలిపించి, తన కుటుంబానికి అల్పాహార విందు ను ఏర్పాటు చేసింది. స్వయంగా వాళ్ళతోనే కలిసి తానూ స్వీకరించింది. అంతే కాకుండా వారిని గౌరవంగా సత్కరించడం ద్వారా కష్టపడి పనిచేసే వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇటీవల కాకినాడలోని కెనాల్ రోడ్డులో విధి నిర్వహణలో లేకున్నా, చంకనెత్తుకున్న బిడ్డతోనే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. ఆ ఒక్క ఘటన పోలీస్ వృత్తిలోని బాధ్యతను, మానవీయ కోణాన్ని దేశానికి చూపించింది. ఆ ఘటన తెలిసిన వెంటనే హోం మంత్రి అనిత రెండు రోజుల క్రితం స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెను కుటుంబంతో కలిసి కలవాలన్న కోరికను గౌరవిస్తూ, గురువారం విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు. అక్కడ జరిగిన భేటీ కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా, ఒక పోలీస్ కుటుంబంతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూపిన ఆత్మీయ సందర్భంగా మారింది. జయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి హోం మంత్రి స్వయంగా టిఫిన్ చేశారు. కొసరి కొసరి వడ్డిస్తూ, ఒకే టేబుల్ పై కూర్చొని భోజనం చేయడం జయశాంతికి జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా మారింది. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఆమె వ్యక్తం చేశారు. జయశాంతి కుమారుడితో సరదాగా ముచ్చటించిన మంత్రి, కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అవసరమైన బట్టలు అందించి, గౌరవంగా పంపించారు. జయశాంతి, వారి కుటుంబాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు హోమ్ మంత్రి. శాఖ ప్రతిష్టను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందిని హోం మంత్రి అనిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే చోట పూజ.. నమాజ్ ! సుప్రీం సంచలన తీర్పు

ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు

మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య

టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌

దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే