Pawan Kalyan: బీసీలు అధికారంలోకి రాకూడదనే కుట్ర జరుగుతుంది : పవన్ కల్యాణ్

Updated on: Nov 26, 2022 | 8:43 PM

తూర్పు కాపులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. 46 లక్షల జనాభా ఉన్న తూర్పు కాపులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

బీసీ నేతలతో మీటింగ్‌ పెట్టారు జనసేన నేత పవన్‌ కల్యాణ్..  బీసీల రిజర్వేషన్‌, తూర్పుకాపుల సమస్యలపై చర్చించి.. కీలక ప్రసంగం చేశారు. కులం అడ్డు పెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు కానీ, కులం వెనకబడిపోతుందని చెప్పారు. సంఘ కృషికి పాటుపడే నాయకులను తయారు చేయాలని పిలుపునిచ్చారు. తనను తిట్టాలంటే.. తాను పుట్టిన కులం చేతే తిట్టిస్తారని పేర్కొన్నారు. బీసీ కులాలు నోరెత్తకూడదనే.. కార్పోరేషన్లు పెట్టి ఓ ఇద్దరు, ముగ్గురికి పదవులు ఇచ్చారని ఆరోపించారు. కులం అంటే నాయకులు కాదు.. జన సమూహం బలపడాలన్నారు. కుల ప్రయోజనాలు కాపాడే నాయకులను ముందుకు తీసుకురావాలన్నారు. వందల కోట్లు లేకపోయినా.. విల్ పవర్‌తో రాజకీయాలు చేయొచ్చన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Nov 26, 2022 08:29 PM