Watch Video: పాదయాత్ర చేస్తానని బీజేపీ అభ్యర్థి మాధవీలత కీలక ప్రకటన.. ఎందుకంటే..?

|

May 14, 2024 | 2:57 PM

హైదరాబాద్‌ లోకసభ సెగ్మెంటులో బుర్ఖా ఎపిసోడ్‌ ఇప్పుడు కొత్త పంచాయితీగా మారింది. ఒక పోలింగ్‌బూత్‌లో బుర్ఖాలు తొలగించాలంటూ ముస్లిం మహిళలను బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కోరడం వివాదాస్పదమైంది. బూత్‌లెవల్‌ ఆఫీసర్‌ ఫిర్యాదుతో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌ స్పందించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు FIR నమోదు చేశారు.

బుర్ఖాలు తీయాలని ముస్లిం ఓటర్లను కోరడాన్ని మాధవీలత సమర్థించుకున్నారు. 150 మంది మహిళలను మరో ప్రాంతం నుంచి తీసుకొచ్చారన్న సమాచారంతో తాము ఆ పోలింగ్‌ బూత్‌కు వెళ్లామన్నారు. ఓటర్లను సరిపోల్చుకోవడానికి బుర్ఖాలు తొలగించాలని పోలీసులు కోరడం లేదన్నారు. మహిళా పోలీసులు అలా చెక్‌ చేయడానికి తమకు ఇన్‌స్ట్రక్షన్స్‌ లేవని తమ అధికారులు చెప్పినట్లు మాధవీలత ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో దొంగ ఓట్ల భరతం పడతానని మాధవీలత అంటున్నారు. ఇందుకోసం తాను పాదయాత్ర చేస్తాననీ తెలిపారు.

Follow us on