Telangana Polls: తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే స్థానాలు ఎన్ని..? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..

|

Oct 27, 2023 | 12:56 PM

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణలో పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను ఇవాళ విడుదల చేయనుంది. కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ టికెట్ ఇచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మునుగోడు టిక్కెట్ తనకే ఇవ్వాలని పాల్వాయి స్రవంతి పట్టుబడుతున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

తనకు పదవులు ముఖ్యం కాదన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.  కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమన్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రాజగోపాల్‌రెడ్డి.. తన నిర్ణయం వెనుక కారణాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని మునుగోడు ప్రజలు తనపై ఒత్తిడి చేశారని చెప్పారు. ప్రజాభీష్టం మేరకు వంద అడుగులైనా వెనక్కి వేసేందుకు తాను సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ 70-80 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన అంతం కాబోతోందన్నారు. తాను కొంచెం ముందు కాంగ్రెస్‌లో చేరి ఉంటే కేసీఆర్‌ మైండ్‌బ్లాంక్‌ అయ్యేదన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ రాబోతోందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.