Telangana: మోటర్లకు మీటర్లు పెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరిన హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. పదేళ్లలో మునుపెన్నడూ లేని తరహాలో సభలో అధికార-విపక్షాల మధ్య అర్థవంతమైన, ఆసక్తికరమైన చర్చ జరిగింది. కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు, సెటైర్లతో సభ హోరెత్తింది.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేత పత్రంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. శ్వేతపత్రంలోని అంశాలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతోందని ఆరోపించారు. ఓడీ నేరం కాదని, ఆర్బీఐ ఇచ్చిన అవకాశాన్ని మాత్రమే ఉపయోగించుకున్నామన్నారు హరీశ్. వ్యవసాయ బావుల దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టొద్దని హరీశ్ రావు ప్రభుత్వానికి సూచించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయకుండా సంయమనం పాటిస్తుండటంతో సభలో అన్ని అంశాలపై అర్థవంతమైన చర్చ జరుగుతోంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలుగుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Dec 20, 2023 06:47 PM