Watch: గో బ్యాక్ మార్వాడి ఉద్యమంపై రాజా సింగ్ రియాక్షన్ ఇదిగో..
గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. తెలంగాణలోని "గో బ్యాక్ మార్వాడి" ఉద్యమంపై స్పందించారు. ఈ ఉద్యమం రాజకీయ లబ్ధి కోసం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి మార్వాడీల పాత్రను ఆయన ప్రశంసించారు. అలాగే, కొంతమంది మార్వాడీ వ్యాపారులు నాణ్యత లేని సామాన్లు అమ్ముతున్నారనే విషయాన్ని కూడా ఆయన గుర్తించారు.
రాజకీయ లబ్ధికోసమే కొందరు మార్వాడీ గోబ్యాక్ అంటున్నారని అన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. నిజాం కంటే ముందు నుంచే తెలంగాణలో మార్వాడీలు ఉన్నారని.. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి మార్వాడీలు దోహదపడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీలో నాయకులను కొందరు ఫుట్ బాల్ ఆడుకుంటున్న మాట వాస్తవమేనని.. కొందరు బీజేపీ నేతల కారణంగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా పోయిందన్నారు. రాజాసింగ్‌తో టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్.
గో బ్యాక్ మార్వారి ప్రచారం తెలంగాణలోని అన్ని జిల్లాలకు వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారని బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
Published on: Aug 29, 2025 05:27 PM
