Ganesh Visarjan 2023: జైజై.. గణేశా.! నిఘా నీడలో నిమజ్జనాలు.. నగరమంతటా సీసీ కెమెరాలే..
వినాయక చవితి మూడు కమీషనరేట్ల పరిధిలో పెద్ద పండుగ.. నగర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు అవుతాయి. అందుకే గణేష్ నిమజ్జనానికి కూడా అంతే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా..
వినాయక నిమజ్జనాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్. వినాయక చవితి మూడు కమీషనరేట్ల పరిధిలో పెద్ద పండుగ.. నగర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు అవుతాయి. అందుకే గణేష్ నిమజ్జనానికి కూడా అంతే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినాయక చవితి ఉత్సవాల కోసం నెలరోజుల ముందు నుంచే తమ సిబ్బందిని సన్నద్ధం చేసామన్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని రోడ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ పూర్తి చేశామన్నారు. గణేష్ మండప నిర్వాహకులతో మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకున్నామన్నారు. గత సంవత్సరం రాచకొండ కమిషనర్ పరిధిలో 9000 విగ్రహాలు ప్రతిష్టిస్తే.. ఈసారి 11వ వేల విగ్రహాలు ఏర్పాటు అయ్యాయన్నారు. వినాయక నిమజ్జనం కోసం 6,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు మరో వెయ్యిమంది అదనపు సిబ్బంది ఉంటారు. 3600 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు సీపీ చౌహాన్.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం..