Telangana: కేసీఆర్‌పై పోటీ చేస్తున్నా.. ఈటల సంచలన ప్రకటన

|

Oct 12, 2023 | 9:31 PM

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతలు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ఈసారి హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. హుజురాబాద్ బీజేపీ కార్యకర్తల మీటింగ్‌లో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లోను, గజ్వేల్ లోను పోటీ చేస్తానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ లాగా తాను కూడా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తానని, రెండింటిలోనూ తానే గెలుపొందుతానని, కేసీఆర్‌ను ఓడిస్తానని ఈటల పేర్కొన్నారు. బీజేపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ఈటల ఈ మాట అన్నారా అనేది బీజేపీ అభ్యర్థుల ప్రకటన రాగానే తేలిపోనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..