Chandrababu: సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా? సుప్రీం తీర్పుపై తీవ్ర ఉత్కంఠ..
News Delhi: టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ బోస్ తో కూడిన ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తుది తీర్పు ఇవ్వనుంది. 17A చుట్టూ ఇరు పక్షాల వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీం వెల్లడించే తీర్పుపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక అంగళ్లు కేసులో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ బోస్ తో కూడిన ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తుది తీర్పు ఇవ్వనుంది. 17A చుట్టూ ఇరు పక్షాల వాదనలు హోరాహోరీగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీం వెల్లడించే తీర్పుపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక అంగళ్లు కేసులో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరు పక్షాల వాదలను విన్న ధర్మాసనం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. స్కీల్ కేసుకు సంబంధించి చంద్రబాబుపై ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ వేశారు. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఉండవల్లి కోరుతున్నారు. 44 మందిని ప్రతివాదులు చేరుస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై కూడా ఇవాళ విచారణ జరగనుంది. అయితే వీటన్నింటిలోనూ ముఖ్యమైనది, యావత్ టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నది సుప్రీం కోర్టు తీర్పు వైపే.