Watch Video: చంద్రబాబు బరువు తగ్గలేదు.. కేజీ పెరిగారు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో కల్పిస్తున్న సదుపాయాలపై కల్పించిన సజ్జల.. ప్రభుత్వం మిగతా ఖైదీలందరికీ కల్పించే సదుపాయాలన్నింటినీ చంద్రబాబుకు కల్పిస్తోందన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. గంట గంటకూ హెల్త్ బులెటిన్ విడుదల చేయాలా అని సజ్జల ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు బరువు తగ్గ లేదు కదా… కిలో పెరిగారంటూ చెప్పుకొచ్చారు. గత నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు 5 కేజీల బరువు తగ్గారంటూ టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేయడంపై సజ్జల స్పందించారు. జైల్లో ప్రతి ఆహారాన్నీ చెక్ చేశాకే చంద్రబాబుకి అందిస్తున్నారని, చివరికి ఇంటి నుంచి తీసుకొస్తున్న ఫుడ్‌ను కూడా చెక్ చేస్తున్నట్టు సంచలన కామెంట్స్ చేశారు. అయినా, చంద్రబాబు కోసం ఏసీ పెట్టడానికి జైలు ఏమైనా అత్తారిల్లా అంటూ సెటైర్లేశారు.