Delhi: జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ.. హాజరవ్వనున్న రాహుల్, ఖర్గే

|

Jun 26, 2023 | 5:27 PM

ఢిల్లీలోని AICC కేంద్ర కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్‌తో రాహుల్ గాంధీ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్‌, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్‌ అలీ, సీతక్క పాల్గొన్నారు. ఈ సమావేశానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథరెడ్డి, అరికెల నర్సారెడ్డి హాజరయ్యారు

రాహుల్‌తో భేటీ అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తమకు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు వచ్చినట్లు తెలిపారు. తాము ప్రాంతీయ పార్టీ దిశగా ఆలోచన చేశామని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు తెలిపారు. కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. సోనియాకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం అని.. జూలై 2న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు పొంగులేటి తెలిపారు.

Published on: Jun 26, 2023 05:00 PM