CM Revanth Reddy: ఫుట్‌బాల్‌ దిగ్గజంతో తలపడనున్న సీఎం రేవంత్‌

Updated on: Dec 01, 2025 | 3:13 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో జరగనున్న "డ్రీమ్ ఫుట్‌బాల్ మ్యాచ్" కోసం యువకులతో కలిసి ప్రాక్టీస్ చేశారు. జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి వరకు సాగిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం ఫుట్‌బాల్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. RR-9 వర్సెస్ ML-10 జట్ల మధ్య జరగనున్న ఈ క్రేజీ మ్యాచ్‌తో రాష్ట్ర క్రీడాస్ఫూర్తిని హైలైట్ చేయనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేశారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ప్రాంగణంలో యువకులతో కలిసి ఆయన ఫుల్ ప్రాక్టీస్ చేశారు. డిసెంబరు 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్లెండ్లీ మ్యాచ్ లో మెస్సీ పాల్గొననున్న నేపథ్యంలో.. ఒక ఫుట్ బాల్ క్రీడాకారుడిగా సీఎం రేవంత్ కూడా ముందస్తు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. డిసెంబరు 13న హైదరాబాద్‌ వస్తున్న ప్రపంచ ఆటగాడు మెస్సీతో ఫుట్‌బాల్‌ ఆడేందుకు CM రేవంత్‌ రెడ్డి సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ స్పిరిట్‌ను హైలైట్‌ చేశారు. యువకులతో కలిసి ఫుట్‌బాల్‌ జెర్సీలో మెరిసారు. యువకులకు తానేమీ తక్కువ కాదంటూ తనలోని ఫుట్‌బాల్‌ ఆట నైపుణ్యాన్ని సీఎం మరోసారి బయటపెట్టారు. ఆదివారం రోజంతా కార్యక్రమాలు ముగించుకొని ఫుట్‌బాల్‌ ఆటగాళ్లతో గ్రౌండ్‌లోకి దిగారు సీఎం. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్‌ 13న ఉప్పల్‌ స్టేడియంలో ఫుట్‌బాల్‌ డ్రీమ్‌ మ్యాచ్‌ నిర్వహిస్తోంది. ఈ మ్యాచ్‌లోనే లియోనల్‌ మెస్సీ.. సీఎం రేవంత్‌రెడ్డి.. అపోజిట్‌ టీమ్స్‌లో ఆడుతూ తలపడనున్నారు. RR-9 టీమ్‌ తరపున సీఎం రేవంత్‌.. ML-10 జట్టు తరపున మెస్సీ ఆడనున్నారు. రేవంత్‌.. 9వ నెంబర్‌ జెర్సీని.. మెస్సీ.. 10వ నెంబర్‌ జెర్సీ ధరించి గ్రౌండ్‌లోకి దిగుతారు. ఒక ముఖ్యమంత్రి.. ప్రముఖ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌.. గ్రౌండ్‌లో తలపడనుండటం క్రేజ్‌తోపాటు ఆసక్తిని రేపుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.! తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్స్

ఒక్కటైన సమంత, రాజ్ నిడమోరు.. పెళ్లి వీడియో