CM KCR: తుది ఘట్టానికి కేసీఆర్‌ రాజశ్యామల యాగం !!

|

Nov 03, 2023 | 8:50 PM

సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజ శ్యామల యాగం తుది దశకు చేరింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లో సీఎం కేసీఆర్ దంపతులు రాజ శ్యామల యాగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేస్తున్న ఈ రాజ శ్యామల యాగం ఇవాల్టితో ముగుస్తోంది. ఈ క్రమంలో రాజశ్యామల అమ్మవారు నర్తనకాళి అవతారంలో పూజలందుకుంటున్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు.

సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రాజ శ్యామల యాగం తుది దశకు చేరింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లో సీఎం కేసీఆర్ దంపతులు రాజ శ్యామల యాగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేస్తున్న ఈ రాజ శ్యామల యాగం ఇవాల్టితో ముగుస్తోంది. ఈ క్రమంలో రాజశ్యామల అమ్మవారు నర్తనకాళి అవతారంలో పూజలందుకుంటున్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు. పూర్ణాహుతి ముహూర్త సమయానికి రాజశ్యామల అమ్మవారి మంత్రాలను మూడు లక్షల సార్లు హవనం అయ్యేలా పండితులతో చర్చించారు. కుంభోద్వాసన చేసిన అనంతరం యాగంలో మంత్రించిన జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులపై చల్లుతారు. అలాగే యాగ భస్మాన్ని కేసీఆర్‌ నుదుట దిద్దుతారు. యాగం ప్రారంభానికి ముందు కేసీఆర్‌ దంపతులు ధరించిన కంకణాలను యాగశాలలో కంకణ విసర్జన ద్వారా పీఠాధిపతులకు అందిస్తారు. దీంతో రాజశ్యామల యాగం పరిసమాప్తం అవుతుంది. వేద పండితులు మహదాశీర్వచనం అందించిన తర్వాత పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్‌ పాదపూజ చేస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నామినేషన్లకు ముహూర్త బలం.. ఆ నాలుగు రోజులే !!

రోడ్డుపై నగ్నంగా తిరుగుతూ.. పోలీసులపైనే దాడి !!

Gaza–Israel conflict: గాజాను పూర్తిగా చుట్టిముట్టేసాం.. నల్లసంచుల్లో శవాలుగా పంపిస్తాం

రిక్టర్‌ స్కేలుపై 6.3గా తీవ్రతతో మళ్లీ భూకంపం.. ఈసారి ఎక్కడంటే ??

Follow us on