CM KCR: అప్పటి ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నా.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

|

Oct 17, 2023 | 5:38 PM

CM KCR Sircilla Visit: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో భారత రాష్ట్ర సమితి అధినేత (BRS), ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. హ్యాట్రిక్ గెలుపు దిశగా గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

CM KCR Sircilla Visit: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో భారత రాష్ట్ర సమితి అధినేత (BRS), ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. హ్యాట్రిక్ గెలుపు దిశగా గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తొలుత సిరిసిల్ల, తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో రెండు పట్టణాల్లో గులాబీ శ్రేణుల సందడి నెలకొంది. ఈ సభలకోసం భారీ ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ ముందుగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కేసీఆర్ మాట్లాడనున్నారు. లైవ్ వీడియో వీక్షించండి..

రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు( సీఎం కేసీఆర్) ప్రత్యర్ధులకు అందని స్పీడ్‌లో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలపై ఫైర్ అవుతూనే.. కరెంట్‌.. ధరణి లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనను 60ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలంటూ ఓటర్లను కోరుతున్నారు. ఈ క్రమంలో సిరిసిల్లలో సీఎం కేసీఆర్ ఏ మాట్లాడనున్నరనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 17, 2023 04:46 PM