CM KCR Public Meeting: బాసర ఆలయాన్ని పునఃనిర్మిస్తాం.. నిర్మల్‌ సభలో కేసీఆర్‌..

Edited By: seoteam.veegam

Updated on: Jun 07, 2023 | 5:06 PM

నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కాసేపట్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో 56 కోట్లతో ఈ కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. సుమారు 16 ఎకరాల్లో జీ ప్లస్‌ టు విధానంలో..

నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కాసేపట్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో 56 కోట్లతో ఈ కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. సుమారు 16 ఎకరాల్లో జీ ప్లస్‌ టు విధానంలో దీనిని నిర్మించారు. దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా కాన్ఫరెన్స్‌ హాల్‌ను కూడా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిర్మించారు. కొండాపూర్‌ వద్ద నిర్మించిన BRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

Published on: Jun 04, 2023 05:25 PM