CM Chandrababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు సంచలన కామెంట్స్

| Edited By: Phani CH

Sep 19, 2024 | 11:04 AM

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి మరో కాంట్రవర్సీకి తెర తీసింది.లడ్డు రుచి, వాసన, నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టిన టిటిడి లడ్డూ తయారీలో నాణ్యత లేని నెయ్యి కారణమని గుర్తించింది. నెయ్యి సరఫరా చేస్తున్న సప్లయర్స్ పై కొరడా జులిపిస్తే లడ్డూ తయారీకి నాసిరకం సరుకులు, అనిమల్ ఫ్యాట్ వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో కాంట్రవర్సీ అయ్యింది.

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి మరో కాంట్రవర్సీకి తెర తీసింది.లడ్డు రుచి, వాసన, నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టిన టిటిడి లడ్డూ తయారీలో నాణ్యత లేని నెయ్యి కారణమని గుర్తించింది. నెయ్యి సరఫరా చేస్తున్న సప్లయర్స్ పై కొరడా జులిపిస్తే లడ్డూ తయారీకి నాసిరకం సరుకులు, అనిమల్ ఫ్యాట్ వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో కాంట్రవర్సీ అయ్యింది. సీఎం చంద్రబాబు ఆరోపణలకు వైసీపీ ఇచ్చిన కౌంటర్ కూడా పొలిటికల్ హీట్ ను పెంచింది. దేవుడి దగ్గర ప్రమాణానికి సిద్ధమన్న వైవీ సుబ్బారెడ్డి చాలెంజ్ ఇప్పుడు శ్రీవారి లడ్డును చర్చగా మార్చింది. తిరుమల లడ్డు. శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైంది. అయితే ఇప్పుడు ఆ లడ్డూ ప్రసాదంలో నెయ్యి మరింత కాంట్రవర్సీ అయింది. వెంకన్న భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డు ప్రసాదం నాణ్యత పై ఈ మధ్య కాలంలో భక్తుల నుంచి వస్తున్న విమర్శలపై దృష్టి పెట్టిన టిటిడి నాణ్యతను పెంచేందుకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో అంతే ప్రాధాన్యతను భక్తులు శ్రీవారి లడ్డు ప్రసాదంకు ఇస్తుండగా గత కొద్ది రోజులుగా నాణ్యతపై భక్తుల నుంచి పిర్యాదులు, విమర్శలకు టిటిడి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. తిరుమలలో ప్రక్షాళన షురూ చేసిన కూటమి సర్కార్ లడ్డు తయారీలో నాణ్యతకు పెద్ద పీట వేసింది. తిరుమల వెంకన్న లడ్డు నాణ్యత పట్ల వస్తున్న విమర్శలు, అందుతున్న ఫిర్యాదులపై ఫోకస్ పెట్టింది. లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత లేదని గుర్తించిన టిటిడి ఈ మేరకు చర్యలు చేపట్టింది. నెయ్యి సరఫరాలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ధూమ్‌ 4లో విలన్‌గా రోలెక్స్‌ ఈసారి బాలీవుడ్‌ బద్దలవ్వాల్సిందే !!

కోలీవుడ్‌ డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేసిన యంగ్ టైగర్

అతను ఏ హీరో ఫ్యాన్‌ అయినా.. వదిలిపెట్టొద్దు

రేస్‌కార్లే రూట్ మార్చాయి.. భారత డ్రైవర్‌ జస్ట్ మిస్

Follow us on