CM Chandrababu: ఏపీ అంటే అమరావతి, పోలవరం.. ఫ్యూచర్ ప్లాన్స్‌పై సీఎం చంద్రబాబు సంచలన ప్రెస్ మీట్..

|

Jun 20, 2024 | 3:39 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు.. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు.. నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు రాజధాని టూర్‌ మొదలైంది. ఉద్దండరాయుడిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం.. సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఫౌండేషన్‌ స్టోన్‌ దగ్గర ఫొటో గ్యాలరీని వీక్షించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు.. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు.. నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు రాజధాని టూర్‌ మొదలై అన్ని ప్రాంతాల్లో కొనసాగింది. ఉద్దండరాయుడిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఫౌండేషన్‌ స్టోన్‌ దగ్గర ఫొటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్‌ నిర్మాణాలన్నింటినీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాయపూడిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పరిశీలించారు.. అంతేకాకుండా నిర్మాణదశలో ఉన్న పలుభవనాలను పరిశీలించి.. పురోగతిపై ఆరా తీశారు. హైకోర్టు, సెక్రటేరియట్‌, జడ్జి క్వార్టర్స్‌ బిల్డింగులను పరిశీలించారు. అనంతరం అమరావతి ఫ్యూచర్ ప్లాన్స్‌పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ అంటే అమరావతి, పోలవరం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు 1631 రోజులు ఆందోళన చేశారని.. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అంటూ పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులకు దక్కుతుందన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా.. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ఏం చేస్తాడో ఐదేళ్లు మనం చూశామంటూ వివరించారు. అమరావతి ఏ వ్యక్తికో, వర్గానికో సంబంధించినది కాదు.. 5 కోట్ల ఆంధ్రులకు అమరావతి చిరునామా అంటూ చంద్రబాబు వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on