Watch: సీఎం రేవంత్‌ను కలిసిన మల్లారెడ్డి.. అందుకేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ని కలుసుకున్నారు. తన మనమరాలి వెడ్డింగ్ కార్డుని ముఖ్యమంత్రికి మల్లారెడ్డి అందజేశారు. వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ని కలుసుకున్నారు. తన మనమరాలి వెడ్డింగ్ కార్డుని ముఖ్యమంత్రికి మల్లారెడ్డి అందజేశారు. వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆసక్తికరంగా మారింది. గతంలో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రేవంత్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు మల్లారెడ్డి.
రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎం అయ్యాక మల్లా రెడ్డి తన వాయిస్ తగ్గించారు. మల్లా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా గతంలో ప్రచారం జరిగింది. అయితే బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని మల్లారెడ్డి చాలాసార్లు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రేవంత్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తన మనమరాలి పెళ్లి ఉందని, పత్రిక ఇచ్చేందుకు వచ్చానని మల్లారెడ్డి తెలిపారు. దీని వెనుక ఇతర రాజకీయ కారణాలు ఏమీ లేవని చెప్పారు.