Watch: బీఆర్ఎస్‌లో కవిత కుంపటి.. రాజకీయ కుట్రల వెనకున్నది ఎవరు..?
కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్‌ను కుదిపేస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. హరీష్ రావు, సంతోష్‌ల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని వ్యాఖ్యానించారు. అటు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ నేత పల్లా ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఆయన ఏమన్నారో ఇక్కడ వీడియోలో చూడండి.
బీఆర్‌ఎస్‌లో కవిత కుంపటి వెనుక రగులుతున్న రాజకీయం ఇది. అసలు పార్టీ నుంచి కవిత బయటకొచ్చింది, మనసులో విషయం బయటపెట్టింది.. ఎవరో ఒక మనిషి వెనుక ఉండడం వల్లనే. ఇదీ బీఆర్ఎస్ మాట. కానీ.. కవిత చెబుతుంది ఇంకాస్త డిఫరెంట్. హరీష్‌రావు, సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారంటున్నారు ఆమె. గతంలో పార్టీ వీడిన నేతలందరూ వీళ్లిద్దరి వల్లనే అంటూ తేల్చేశారు కూడా. ఈ రెండు వెర్షన్స్‌కి రేవంత్ రెడ్డి ఘాటు కౌంటరే ఇచ్చారు. ఉంటేగింటే నాయకుడిగా ప్రజల ముందు ఉంటానుగానీ ఎవరెవవరి వెనకో తానెందుకు ఉంటానన్నారు. మొత్తం ఈ ఎపిసోడ్‌లో పల్లా రాజేశ్వర్, కవిత, రేవంత్ వెర్షన్స్ ఎలా ఉన్నాయో వాళ్ల మాటల్లోనే విందాం…