Big News Big Debate: తెలంగాణ ‘దంగల్’.. హామీలతో జోరుమీదున్న పొలిటికల్ పార్టీలు.. లైవ్ వీడియో

|

Oct 03, 2023 | 7:12 PM

ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందన్న వార్తల మధ్య తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీలే కాదు.. ఆరోపణాస్త్రాలు బలంగా సంధించారు. పాలమూరులో వరాలు కురిపించిన మోదీ.. ఇందూరులో బీఆర్ఎస్‌ - కాంగ్రెస్ పార్టీలపై విరుచుకపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారన్నారు. కేటీఆర్‌కు అధికారాలు అప్పగించేందుకు సిద్ధపడ్డారన్నారు మోదీ. తాను అంగీకరించకపోవడంతో మళ్లీ కేసీఆర్‌ కనిపించలేదన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందన్న వార్తల మధ్య తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీలే కాదు.. ఆరోపణాస్త్రాలు బలంగా సంధించారు. పాలమూరులో వరాలు కురిపించిన మోదీ.. ఇందూరులో బీఆర్ఎస్‌ – కాంగ్రెస్ పార్టీలపై విరుచుకపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారన్నారు. కేటీఆర్‌కు అధికారాలు అప్పగించేందుకు సిద్ధపడ్డారన్నారు మోదీ. తాను అంగీకరించకపోవడంతో మళ్లీ కేసీఆర్‌ కనిపించలేదన్నారు. ఇప్పటివరకూ ఈ రహస్యం ఎప్పుడూ ఎవరికీ షేర్‌ చేయలేదన్నారు మోదీ. అయితే ఇన్నిరోజులు ఎందుకు దీనిపై నోరెత్తలేదని కౌంటర్‌ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏ పార్టీతో పొత్తులకై చర్చించలేదన్నారు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌. ఎన్నికల కోసం మాత్రమే ఆరోపణలు చేస్తున్నారనన్నారు.