Telangana: ఆర్టీసీ బిల్లుపై రాజ్‌భవన్ అనుమానాలేంటి? ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది?
రాజ్‌భవన్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య సరికొత్త వివాదం రాజుకుంది. ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు అనుమతించాలని ప్రభుత్వం గవర్నర్‌కు పంపారు. అసెంబ్లీ నడుస్తుందని అత్యవసరంగా అనుమతించాలని ప్రభుత్వం అంటుంటే.. న్యాయ సలహా లేకుండా క్లియర్ చేయలేమన్నారు గవర్నర్ తమిళిసై.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లు వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బాగంగానే ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు కూడా వెంటనే సిద్ధం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయాలని భావించింది ప్రభుత్వం. అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి కావాల్సి ఉంది. బుధవారమే బిల్లును రాజ్‌భవన్‌కు పంపారు అధికారులు. అయితే ఇప్పటికీ రాజ్‌భవన్ నుంచి అనుమతి రాకపోవడంతో అసెంబ్లీలో బిల్లు ఆమోదంపై నీలినీడలు అలుముకున్నాయి.
అసెంబ్లీ సమావేశాలు మూడురోజుల మాత్రమే జరుగతాయని ప్రకటించిన నేపథ్యంలో త్వరగా ఆమోదించాలని కార్మిక సంఘాలు కోరుకుంటున్నాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీ బిల్లును ఇంకా పరిశీలించాల్సి ఉందని.. న్యాయ సలహాలు తీసుకునేందుకు మరికొంత సమయం కావాలంటూ రాజ్‌భవన్ నుంచి ప్రకటన విడుదల అయింది. దీనిపై అటు కార్మిక సంఘాలు, ఇటు బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆపుతున్నారని.. ఇది కార్మికులకు అన్యాయం చేయడమేనంటూ ఆరోపించారు. ఇప్పటికే ప్రైవేటు యూనివర్శిటీలు సహ పలు బిల్లులుపై తీవ్ర వివాదాలు తలెత్తాయి. పంచాయితీలు కోర్టుల దాకా చేరాయి. తాజాగా ఆర్టీసీ విలీనం బిల్లు రాజ్‌భవన్‌కు, సచివాలయానికి మధ్య గ్యాప్ పెంచుతోంది. రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. బిల్లు విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా? పరిశీలన పేరుతో రాజ్‌భవన్‌లో కాలయానప జరుగుతోందా ఏది నిజం? బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో తెలుసుకుందాం పదండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
