Big News Big Debate: తెలంగాణపై ఆపరేషన్ ‘షా’.. గేమ్ ప్లాన్ ఏంటో…

|

Feb 28, 2023 | 7:00 PM

తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపై కోంగా ఉన్నారని.. విముక్తి మార్గం మేం చూపిస్తామని తరుణ్‌ చుగ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు వెళ్లి ఎండగడతామని ఈ దిశగా భవిష్యత్‌ కార్యాచరణపై అమిత్‌షా, రాష్ర్ట పార్టీ నేతలతో చర్చించారని తరుణ్ చుగ్ అన్నారు.

సౌతిండియా ముఖ్యంగా తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఏపీలో జీరో అయినా, తెలంగాణలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రంగంలో దిగింది పార్టీ జాతీయ నాయకత్వం. ప్రధాని మోదీ, అమిత్‌షాలకు పర్సనల్‌ టార్గెట్‌ కూడా తెలంగాణ అయిందన్నది పార్టీ నేతలు పదేపదే చెబుతున్న మాట. ఇందులో భాగంగానే ఇవాళ మరోసారి మూడున్నర గంటలకు పైగా సుదీర్ఘంగా రాష్ట్ర నాయకులతో సమావేశం అయింది పార్టీ అగ్రనాయకత్వం. 15 రోజుల క్రితమే అమిత్‌షాతో ఫిక్స్‌ అయిన మీటింగ్‌ అని బండి సంజయ్‌ అంటున్నా… అంతకుమించి ఈ సమావేశానికి ప్రత్యేకత ఉందన్నది పార్టీ ఇన్‌సైడ్‌ టాక్‌. 20 మంది నేతలను ప్రత్యేకంగా పిలిచి మరీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్‌షా, పార్టీ అధ్యక్షలు జేపీ నడ్డా.

 

Published on: Feb 28, 2023 06:56 PM